Cricket: అప్పటి వరకు రోహిత్ ను తప్పించొద్దు
రోహిత్ ను తప్పించొద్దు

Cricket: వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించి గిల్ కు పగ్గాలు అప్పగిస్తారని వార్తలు వస్తుండటంతో హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దేశం కోసం వన్డే వరల్డ్ కప్ గెలవాలని ఉందని రోహిత్ గతంలో చెప్పారు. వచ్చే వరల్డ్ కప్ వరకు రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు అతడి ఫ్యాన్స్. ఈ హిట్టర్ 24 ఐసీసీ వైట్ బాల్ మ్యాచులకు కెప్టెన్సీ చేయగా 23 మ్యాచుల్లో భారత్ గెలిచిందని, సగటు 54గా ఉందని చెబుతున్నారు. వచ్చే 2027 వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్ కంటిన్యూ చేయాలంటున్నారు ఫ్యాన్స్.
రోహిత్ శర్మ 138 అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారత జట్టుకు నాయకత్వం వహించి 100 విజయాలు సాధించాడు. ఈ ఘనత సాధించిన భారత కెప్టెన్లలో అతనిది నాలుగో స్థానం. 138 మ్యాచ్‌లలో 100 విజయాలు సాధించి, రికీ పాంటింగ్‌తో కలిసి అత్యంత వేగంగా 100 విజయాలు సాధించిన కెప్టెన్ రికార్డును పంచుకున్నాడు.
అతని కెప్టెన్సీలో భారత జట్టు విజయ శాతం 72%తో అత్యధికంగా ఉంది, ఇది మహ్మద్ అజారుద్దీన్ (47.05%), ఎంఎస్ ధోనీ (53.61%), విరాట్ కోహ్లీ (63.38%) ల కంటే ఎక్కువ.రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఐసీసీ టోర్నమెంట్లలో కెప్టెన్‌గా అత్యధిక విజయ శాతం (90%) రోహిత్ శర్మదే, అతని తర్వాత పాంటింగ్ (88%), గంగూలీ (80%) ఉన్నారు.
