ఇండియా విక్టరీ

Cricket: రెండో టీ20లోనూ భారత మహిళల జట్టు ఇంగ్లాడ్ ను చిత్తు చేసింది. 24 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన భారత్ రోడ్రిగ్స్ 63,అమన్ జోత్ 63,రిచా 32 రాణించడంతో 181 రన్స్ చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో లారెన్ బెల్ 2, లారెన్ ఫిలెర్ ,ఆర్లోట్ తలో వికెల్ తీశారు.

182 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్7 వికెట్లు కోల్పోయి 157 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో టామీ బీమౌంట్ 54, అమీ జోన్స్ 32, ,సోఫి ఎక్లేస్టోన్ 35 పరుగులు తీశారు. ఇండియా బౌలర్లలో శ్రీచరణి2, దీప్తి శర్మ, అమన్ జోత్ చెరో వికెట్ తీశారు. ముగ్గురిని రనౌట్ చేయడం విశేషం.ఈ విజయంతో 5 మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది.ఈ ఐదు టి 20 మ్యాచ్ లు పూర్తికాగానే 3 వన్డేలు ప్రారంభం కానున్నాయి. ఇక అటు పురుషుల ఇండియా జట్టు కూడా ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

PolitEnt Media

PolitEnt Media

Next Story