Olympics Cricket Schedule: ఒలింపిక్స్‌లో క్రికెట్ షెడ్యూల్ వచ్చేసింది
షెడ్యూల్ వచ్చేసింది

Olympics Cricket Schedule: దాదాపు 128 ఏళ్ల విరామం తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్ తిరిగి రాబోతోంది. 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్ గేమ్స్‌లో టీ20 ఫార్మాట్ క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. లాస్ ఏంజిల్స్ కు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న పొమోనా నగరంలోని ఫెయిర్‌గ్రౌండ్స్ స్టేడియంలో 2028 జులై 12న క్రికెట్ మ్యాచ్‌లు మొదలవుతాయి. విమెన్స్ ఫైనల్ జులై 20న, మెన్స్ ఫైనల్ జులై 29న షెడ్యూల్ చేశారు.
ఎక్కువ డబుల్ హెడర్స్ మ్యాచ్‌లను ప్లాన్ చేశారు. కాగా, మెన్స్, విమెన్స్ కేటగిరీల్లో ఆరేసి జట్లు ఒలింపిక్స్‌లో పోటీ పడనున్నాయి. ప్రతి టీమ్‌లో15 మంది క్రికెటర్లు చొప్పున మొత్తంగా 180 మంది ప్లేయర్లు పాల్గొంటారు. కాగా, ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉండటం ఇది రెండోసారి కానుంది. గతంలో 1900లో పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో మాత్రమే క్రికెట్ ఆడారు. అప్పుడు గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ జట్లు రెండు రోజుల మ్యాచ్‌లో పోటీపడ్డాయి. ఆ పోరులో గ్రేట్ బ్రిటన్ గోల్డ్ గెలుచుకుంది. క్రికెట్ వరల్డ్ వైడ్ పాపులర్ అవ్వడంతో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) 2028 లాస్ ఏంజిల్స్ గేమ్స్ కోసం ఆమోదించిన ఐదు కొత్త ఆటల్లో క్రికెట్‌ను కూడా చేర్చింది.
