వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్‌లో 41 గోల్స్ తో రికార్డు.

Cristiano Ronaldo: ఫేమస్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో ​​రోనాల్డో తాజాగా ఒక కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రోనాల్డో రికార్డు నెలకొల్పాడు.

పోర్చుగల్ తరపున ఆడుతున్న రోనాల్డో, ఇప్పటివరకు వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల్లో 41 గోల్స్ చేశాడు. లిస్బన్‌లోని ఇస్టాడియో జోష్ అల్వలేడ్ స్టేడియంలో హంగేరీతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ 2-2 గోల్స్ తేడాతో డ్రాగా ముగియగా, అందులో రోనాల్డో రెండు గోల్స్ చేశాడు.

రూయిజ్ రికార్డు బ్రేక్

ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల చరిత్రలో ఇంతకుముందు అత్యధిక గోల్స్ (39) చేసిన రికార్డు గ్వాటెమాలా ప్లేయర్ కార్లో రూయిజ్ పేరిట ఉండేది. ఇప్పుడు రోనాల్డో ఆ రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా, క్వాలిఫైయింగ్ మ్యాచుల్లో 40 గోల్స్ మైలురాయిని దాటిన తొలి ఫుట్‌బాల్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

అయితే రోనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్ జట్టు ఇంకా వచ్చే ఏడాది జరగబోయే ఫిఫా ప్రపంచ కప్‌కు అర్హత సాధించలేదు. నవంబర్ 14న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే రోనాల్డో జట్టు వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story