Ramiz Raja: సొంత ఆటగాడిపైనే విమర్శలు.. రమీజ్ రాజాపై ఫ్యాన్స్ ఫైర్
రమీజ్ రాజాపై ఫ్యాన్స్ ఫైర్

Ramiz Raja: పాకిస్తాన్ క్రికెట్‌లో సొంత ఆటగాళ్లను విమర్శించడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. తాజాగా ,మాజీ క్రికెటర్ రమీజ్ రజా.. స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజాంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీశాయి. లాహోర్ వేదికగా పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. పాకిస్తాన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (93), కెప్టెన్ షాన్ మసూద్ (76) బాగా ఆడారు. సీనియర్ ఆటగాడు బాబర్ అజాం 23 పరుగులు చేసి ఔటయ్యాడు.
రమీజ్ రజా వివాదాస్పద వ్యాఖ్యలు:
బాబర్ అజాం కేవలం 1 పరుగు దగ్గర ఉన్నప్పుడు దక్షిణాఫ్రికా బౌలర్ వేసిన బంతికి అంపైర్ అతన్ని ఔట్ ఇచ్చారు. అయితే బాబర్ వెంటనే డీఆర్ఎస్ తీసుకున్నాడు. రివ్యూలో అది నాటౌట్‌గా తేలింది. ఈ సమయంలో కామెంటేటర్‌గా ఉన్న పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రజా.. తన మైక్ ఆఫ్ అయిందని అనుకొని బాబర్ అజాంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది ఖచ్చితంగా ఔటే. కానీ అతడు ఇప్పుడు డ్రామా స్టార్ట్ చేస్తాడు. డీఆర్‌ఎస్ వృథానే" అని రమీజ్ అన్నారు.
విమర్శల వెల్లువ:
రమీజ్ రజా మాట్లాడిన ఈ మాటలు రికార్డు కావడంతో, వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సొంత దేశపు ఆటగాడిపై, అది కూడా అతను రివ్యూ తీసుకుంటున్నప్పుడు, ఇలా మాట్లాడటంపై నెటిజన్లు రమీజ్ రజాను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒకప్పుడు రమీజ్ పీసీబీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు బాబర్‌ను వెనకేసుకొచ్చేవారు. ఇప్పుడు ఆయనే ఇలా మాట్లాడటం గమనార్హం. ఈ వివాదం పాకిస్తాన్ క్రికెట్‌లో మరోసారి అంతర్గత సమస్యలను బయటపెట్టింది.
బాబర్ అజాం అరుదైన ఘనత:
ఈ మ్యాచ్‌లోనే బాబర్ అజాం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 3,000 పరుగులకు పైగా చేసిన తొలి ఆసియా క్రికెటర్‌గా అరుదైన ఘనతను సాధించారు.
