సర్పరాజ్ ఎమోషనల్ ట్వీట్

Sarfaraz Shares an Emotional Tweet: ఐపీఎల్ (IPL) 2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు ఎంపికైన తర్వాత భారత బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ చాలా భావోద్వేగంగా స్పందించారు.

వేలంలో తనను కొనుగోలు చేసినందుకు సీఎస్‌కే యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. "నాకు కొత్త జీవితాన్ని (New Life) ఇచ్చినందుకు సీఎస్‌కేకు చాలా చాలా ధన్యవాదాలు" అని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు.

అబుదాబీలో జరిగిన ఈ వేలంలో సర్ఫరాజ్ ఖాన్ మొదట 'అన్‌సోల్డ్' నిలిచారు. అయితే తర్వాత జరిగిన వేగవంతమైన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆయనను రూ. 75 లక్షల కనీస ధరకు దక్కించుకుంది.

వేలానికి కొన్ని గంటల ముందే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సర్ఫరాజ్ కేవలం 22 బంతుల్లో 73 పరుగులు చేసి విధ్వంసం సృష్టించారు. ఈ ప్రదర్శనే ఆయనకు సీఎస్‌కేలో చోటు దక్కేలా చేసింది.

సర్ఫరాజ్ ఖాన్ చివరిసారిగా 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడారు. రెండేళ్ల విరామం తర్వాత మళ్ళీ ఐపీఎల్‌లోకి అడుగుపెడుతుండటంతో ఆయనతో పాటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2026లో చెన్నై జట్టు టైటిల్ గెలవడంలో తన వంతు కృషి చేస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story