CSK బర్త్‌డే విషెస్

CSK Sends Birthday Wishes to Sanju: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ పుట్టినరోజు సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ చేసిన పోస్ట్ ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఐపీఎల్ 2026 మెగా వేలానికి ముందు ట్రేడ్ విండోలో అత్యంత సంచలనాత్మక డీల్‌గా సంజు శాంసన్ మార్పిడి వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సంజు శాంసన్‌ను CSK తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా, చెన్నై జట్టు నుంచి స్టార్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా మరియు శాం కరణ్లను రాజస్థాన్ రాయల్స్‌కు పంపేందుకు ఈ ట్రేడ్ డీల్ దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఐపీఎల్ 2025 తర్వాత ఎం.ఎస్. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఆయనకు భవిష్యత్ వారసుడిగా, వికెట్ కీపర్-కెప్టెన్‌గా సంజు శాంసన్‌ను సీఎస్కే చూస్తోంది. ఐపీఎల్ 2025 తర్వాత ఎం.ఎస్. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఆయనకు భవిష్యత్ వారసుడిగా, వికెట్ కీపర్-కెప్టెన్‌గా సంజు శాంసన్‌ను సీఎస్కే చూస్తోంది. ఈ ట్రేడ్‌లో పాల్గొనే ముగ్గురు ఆటగాళ్లు (సంజు శాంసన్, రవీంద్ర జడేజా, శాం కరణ్) ఇప్పటికే దీనికి తమ వ్రాతపూర్వక అంగీకారాన్ని తెలిపి, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EOI) పంపించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story