సౌతాఫ్రికా గ్రాండ్ విక్టరీ

Dewald Brevis: సౌతాఫ్రికా యంగ్ సెన్సేషనల్ డివాల్డ్ బ్రేవిస్ ఆస్ట్రేలియాపై జరిగిన టీ20 మ్యాచ్‌లో కేవలం 41 బంతుల్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డపై టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా, అలాగే ఆస్ట్రేలియాపై అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. బ్రేవిస్ తన దూకుడైన ఆటతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.

ఈ సెంచరీలో అతడు 12 బౌండరీలు, 8 సిక్సర్లు కొట్టి తన బ్యాటింగ్ ప్రతిభను చాటాడు. ఇది అతడి అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీ కావడం విశేషం. అంతేగాకుండా 56 బాల్స్ లో 125 నాటౌట్ గా నిలిచి టీ20 ఫార్మాట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 119 డుప్లెసిస్ రికార్డ్ ను బద్దలు కొట్టాడు.

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కుదిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. బ్రేవిస్ మెరుపు బ్యాటింగ్‌తో భారీ స్కోరు సాధించింది . తర్వాత బౌలింగ్‌లో కూడా రాణించి ఆస్ట్రేలియాను 165 పరుగులకే ఆలౌట్ చేసి, 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.మూడు టీ20ల సిరీస్ ను 11 తో సమం చేసింది. బ్రేవిస్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక మూడో టీ20 ఈ నెల 16న శనివారం జరగనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story