Dewald Brevis: దుమ్ము లేపిన కుర్రాడు.. ఒక్క సెంచరీతో 101 నుంచి 21 ర్యాంక్ కి
ఒక్క సెంచరీతో 101 నుంచి 21 ర్యాంక్ కి

Dewald Brevis: సౌతాఫ్రికా ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ ICC T20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటాడు. 101వ స్థానం నుంచి ఏకంగా 21వ స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఒక టీ20 మ్యాచ్‌లో అతను చేసిన రికార్డు సెంచరీ (125 పరుగులు) కారణంగా, అతని ర్యాంక్ 80 స్థానాల్ని వెనక్కి నెట్టి 21వ స్థానానికి వచ్చాడు. సెంచరీకి ముందు బ్రెవిస్ టాప్-100లో కూడా లేడు.ఇక మన ఇండియా కుర్రాడు అభిషేక్ శర్మ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.
బ్యాటింగ్‌లో టాప్-5
అభిషేక్ శర్మ (ఇండియా)
ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా)
తిలక్ వర్మ (ఇండియా)
ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్)
జోస్ బట్లర్ (ఇంగ్లాండ్)
బౌలింగ్‌లో టాప్-5
జాకబ్ డఫ్ఫీ (న్యూజిలాండ్)
అదిల్ రషీద్ (ఇంగ్లాండ్)
అకీల్ హొసేన్ (వెస్టిండీస్)
వరుణ్ చక్రవర్తి (ఇండియా)
ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా)
ఆల్‌రౌండర్లలో టాప్-5
హార్దిక్ పాండ్యా (ఇండియా)
దీపేంద్ర సింగ్ ఐరీ (నేపాల్)
మహమ్మద్ నబీ (అఫ్ఘానిస్తాన్)
రోస్టన్ చేజ్ (వెస్టిండీస్)
లియామ్ లివింగ్‌స్టోన్ (ఇంగ్లాండ్)

