ఫైనల్ పోరులో జొకోవిచ్,అల్కరాజ్

Australian Open Final Clash: టెన్నిస్ అభిమానులకు ఇదొక అసలైన విందు. ఆస్ట్రేలియా ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ ఫైనల్లో టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్, యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ రేపు తలపడనున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభం అవుతుంది.జొకోవిచ్ తన 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ (రికార్డు) కోసం పోరాడుతుంటే, అల్కరాజ్ తన కెరీర్‌లో మొదటిసారి ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచి "కెరీర్ గ్రాండ్‌స్లామ్" పూర్తి చేయాలని చూస్తున్నాడు.

ఫైనల్‌కు ఎలా చేరారంటే?

ఇద్దరూ సెమీఫైనల్స్‌లో అద్భుతమైన విజయాలు సాధించి ఫైనల్‌కు చేరుకున్నారు. జొకోవిచ్ డిఫెండింగ్ ఛాంపియన్ యానిక్ సిన్నర్‌ను 5 సెట్ల హోరాహోరీ పోరులో ఓడించి 11వ సారి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు చేరాడు. అల్కరాజ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ పై 5 గంటల 27 నిమిషాల పాటు జరిగిన మారథాన్ మ్యాచ్‌లో విజయం సాధించాడు.ప్రస్తుతం వీరిద్దరి మధ్య రికార్డు చాలా ఆసక్తికరంగా ఉంది.

మొత్తం 9 మ్యాచ్‌లు లలో జొకోవిచ్5, అల్కరాజ్ 4 మ్యాచ్ లు గెలిచాడు. 2025 యూఎస్ ఓపెన్ సెమీఫైనల్స్‌లో అల్కరాజ్ గెలిచాడు. అయితే, గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ విజయం సాధించాడు. 38 ఏళ్ల జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ చేరిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించగా, 22 ఏళ్ల అల్కరాజ్ తో ఎదురుదాడికి సిద్ధమయ్యాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story