Ganguly: గంగూలీని భయపెట్టిన బౌలర్ ఎవరో తెలుసా?
బౌలర్ ఎవరో తెలుసా?

Ganguly: భారత క్రికెట్ దిగ్గజాలలో సౌరవ్ గంగూలీ ఒకరు. తన కెప్టెన్సీ ద్వారా టీమిండియా జట్టు దిశను మార్చిన ఘనత గంగూలీకి చెందుతుంది. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి గొప్ప బ్యాట్స్మెన్లతో పాటు తన కాలంలోని అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో గంగూలీ చోటు సంపాదించాడు. విదేశీ మైదానాల్లో ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన గంగూలీ, తన అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రికెట్లో పెద్ద పేరు సంపాదించాడు.
అయితే ఇంతంటి గంగూలీని ఓ బౌలర్ తన బౌలింగ్ తో భయపెట్టాడట. అతను ఎవరో కాదు ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్.అవును ఈ విషయాన్ని గంగూలీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తనను ఎక్కువగా సవాలు చేసిన బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ అని గంగూలీ అంగీకరించాడు. పాకిస్తాన్‌కు చెందిన వసీం అక్రమ్, ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ వంటి బౌలర్లు ఉన్నప్పటికీ, మెక్‌గ్రాత్ గంగూలీకి అత్యంత కఠినమైన ప్రత్యర్థిని అని చెప్పుకొచ్చాడు.
1992లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే ద్వారా గంగూలీ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 1996లో టెస్ట్ అరంగేట్రం చేసి భారతదేశం తరపున 113 టెస్టులు ఆడి 16 సెంచరీలతో 7212 పరుగులు చేశాడు. 311 వన్డేల్లో 22 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలతో 11363 పరుగులు కూడా చేశాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు.
ఇక గ్లెన్ మెక్‌గ్రాత్ ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో గొప్ప పేసర్లలో ఒకరు. అతను 1993 నుండి 2007 వరకు 124 టెస్ట్ మ్యాచ్‌ల్లో 563 వికెట్లు, 250 వన్డేల్లో 381 వికెట్లు, మరియు రెండు T20Iల్లో 5 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్) తరపున 14 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు కూడా పడగొట్టాడు.
