అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దు

Yash Dayal: ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్‌‌‌‌కు కోర్టులో ఊరట లభించింది. ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న దయాల్ అరెస్ట్‌‌‌‌పై అలహాబాద్ హైకోర్టు స్టే ఇచ్చింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును దయాల్ కోరాడు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం దయాల్‌‌‌‌ను ఇప్పుడే అరెస్ట్ చేయకుండా ఆపి ఈ కేసు గురించి పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. అలాగే ఫిర్యాదు చేసిన మహిళకు కూడా నోటీసులు ఇచ్చి ఆమె వివరణను కోరింది. తనను పెండ్లి చైసుకుంటానని నమ్మించి లైంగికంగా వాడుకున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు దయాల్‌‌‌‌పై ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదైంది.

అయితే, ఫిర్యాదు చేసిన మహిళ, దయాల్ మధ్య ఐదేండ్లుగా సంబంధం ఉందని.. కానీ అతను స్టార్ క్రికెటర్ అవ్వగానే డబ్బుల కోసం ఈ కేసు పెట్టిందని యశ్‌‌‌‌ న్యాయవాది వాదించారు. సదరు మహిళతో బంధంలో ఉన్నప్పుడు యశ్ ఆమెకు ఆర్థికంగా సాయం చేశాడని, ఎప్పుడూ తప్పుడు వాగ్దానాలు చేయలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ యశ్ దయాల్ ఐదేండ్లుగా మహిళను మోసం చేస్తూనే ఉన్నాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి తన కుటుంబానికి కూడా ఆమెను పరిచయం చేశాడని ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లో ఉందని తెలిపారు. దాంతో కోర్టు ఈ కేసును మరింత పరిశీలించాలని అభిప్రాయపడింది. తదుపరి విచారణ జరిగి, పోలీసులు తమ నివేదిక ఇచ్చే వరకు దయాల్‌‌‌‌ను అరెస్ట్ చేయకూడదని ఆదేశించింది.

Updated On 16 July 2025 10:39 AM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story