Bumrah's Cricket Career: బుమ్రా క్రికెటర్ కెరీర్ పై సంధిగ్ధం.?
కెరీర్ పై సంధిగ్ధం.?

Bumrah's Cricket Career: జస్ప్రీత్ బుమ్రా టీమిండాయా ప్రముఖ ఫాస్ట్ బౌలర్. తన ప్రత్యేకమైన బౌలింగ్ శైలి, యార్కర్లకు పేరుగాంచిన బుమ్రా, ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో బుమ్రా మూడు టెస్టులు ఆడి మొత్తం 14 వికెట్లు పడగొట్టారు. ఐదో టెస్టుకు దూరంగా ఉన్నాడు. తన ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకొని, ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం ఇంగ్లాండ్‌తో లాస్ట్ రెండు టెస్ట్ మ్యాచ్ ల నుంచి బుమ్రాకు విశ్రాంతి కల్పించారు.
నిరంతర గాయాల సమస్యల కారణంగా బుమ్రా తన టెస్ట్ కెరీర్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. రాబోయే ఆసియా కప్ 2025లో బుమ్రా ఆడటంపై ఇంకా స్పష్టత లేదు, ఎందుకంటే ఆ టోర్నమెంట్ తర్వాత వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ఉంది. అందుకే బీసీసీఐ ఆయన పనిభారాన్ని జాగ్రత్తగా పర్యవేక్షిస్తోంది.
బుమ్రా 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన బుమ్రా.. తొలుత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో (ODI, T20I) అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, ఆ తర్వాత 2018లో టెస్ట్ క్రికెట్‌లో చేరాడు. ICC ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలో (టెస్ట్, ODI, T20I) నంబర్ వన్ ర్యాంకు సాధించిన ఏకైక బౌలర్‌గా బుమ్రా నిలిచారు. తన టెస్ట్ కెరీర్ లో 48 మ్యాచ్ లు ఆడిన బుమ్రా మొత్తం 219 వికెట్లు తీశాడు. వన్డేలో 149, టీ20ల్లో 89 వికెట్లు తీశాడు. ఐపీఎల్ లో 183 వికెట్లు తీశాడు
