వీళ్లపైనే స్పెషల్ ఫోకస్

Duleep Trophy: దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్ కు సిద్దమైంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 7 వరకు సెమీఫైనల్స్ జరగనున్నాయి బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ లో సెమీ ఫైనల్స్ జరగనున్నాయి. ముఖ్యంగా టీమిండియాలో చోటు కోసం ప్రయత్నిస్తున్న శ్రేయాస్ అయ్యర్, పృథ్వీ షా, యశస్వి జైస్వాల్,శార్దూల్ లాంటి ఆటగాళ్ల ప్రదర్శనపై అందరి దృష్టి ఉంది.

సౌత్ జోన్ vs నార్త్ జోన్:

సౌత్ జోన్ జట్టుకు ఈసారి కెప్టెన్‌గా మహ్మద్ అజరుద్దీన్ వ్యవహరిస్తున్నాడు. అంతకుముందు కెప్టెన్‌గా ఉన్న తిలక్ వర్మ ,సాయి కిశోర్ జాతీయ జట్టుకు ఎంపిక కావడంతో టోర్నీ నుంచి తప్పుకున్నారు. నార్త్ జోన్ జట్టు తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్‌ను ఓడించి సెమీఫైనల్స్‌కు చేరుకుంది.

వెస్ట్ జోన్ vs సెంట్రల్ జోన్:

వెస్ట్ జోన్ జట్టు గత సీజన్ ఫైనల్స్ లో ఆడినందున ఈ సారి నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత పొందింది. సెంట్రల్ జోన్ జట్టు నార్త్ ఈస్ట్ జోన్‌ను ఓడించి సెమీఫైనల్స్‌కు చేరుకుంది. సెమీఫైనల్స్ ముందు సెంట్రల్ జోన్ జట్టుకు వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ డెంగ్యూ కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడం షాక్‌ను ఇచ్చింది.ఈ టోర్నమెంట్ నాకౌట్ ఫార్మాట్‌లో జరుగుతోంది.సెమీఫైనల్స్ ప్రత్యక్ష ప్రసారం కావడం లేదు, ఫైనల్ మాత్రమే లైవ్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story