ED Shock to Dhawan and Raina: ధావన్,రైనాకు ఈడీ షాక్.. రూ.11 కోట్ల ఆస్తులు సీజ్
రూ.11 కోట్ల ఆస్తులు సీజ్

ED Shock to Dhawan and Raina: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన1xBetకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో భారత మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్,సురేష్ రైనా ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు.
వీరిద్దరి ఆస్తుల మొత్తం విలువ రూ.11.14 కోట్లు జప్తు చేసింది ఈడీ. రైనా పేరు మీద ఉన్న సుమారు రూ.6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు అటాచ్ అయ్యాయి. ధావన్ పేరు మీద ఉన్న సుమారు రూ. 4.5 కోట్ల విలువైన స్థిరాస్తి తాత్కాలికంగా జప్తు అయ్యింది. అక్రమ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ '1xBet' ప్రమోషన్ కోసం విదేశీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా వీరు మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ చర్యను ఎదుర్కొంటున్నారు. ఈ చర్యలన్నీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 నిబంధనల కింద తీసుకున్నారు.
ఇదే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులోభారత మాజీ క్రికెటర్లు ఊతప్ప, యువరాజ్ సింగ్‌ను కూడా ఈడీ విచారించిన విషయం తెలిసిందే. అలాగే.. బాలీవుడ్ యాక్టర్స్ ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తి, సోనూసూద్‌లను కూడా ఈడీ ఇంటరాగేట్ చేసింది. ధావన్, రైనా ఆస్తులను ఈడీ అటాచ్ చేయడంతో మిగిలిన వారిలో ఆందోళన మొదలైంది.

