నిఖత్ జరీన్ కు సిల్వర్ మెడల్

Elite Women's Boxing Tournament: ఎలైట్ విమెన్స్ బాక్సింగ్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. లాస్ట్ డే టోర్నమెంట్ లో ఫైనల్లో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ ఓవరాల్ చాంపియన్ గా నిలిచింది. ఆ టీమ్ బాక్సర్లు మూడు గోల్డ్ సహా మొత్తం 9 మెడల్స్ సొంతం చేసుకున్నారు. స్టార్ బాక్సర్లు నీతు ఘంఘాస్, లవ్లీనా బొర్గి హైన్, సవీటీ బూరగోల్డ్ మెడల్స్ నెగ్గగా, ఫైనల్లో వాకోవర్ ఇచ్చిన తెలంగాణ స్టార్ నిఖత్ జరీన్ సిల్వర్ గెలుచుకుంది. ముక్కుకు గాయం అవ్వడంతో రైల్వేస్ బాక్సర్ జ్యోతితో 51 కేజీ ఫైనల్ బౌట్ లో నిఖత్ బరిలోకి దిగలేదు.

గోల్డ్ మెడల్ ఖాయమనుకున్న తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ సిల్వర్ తో సరిపెట్టుకుంది. 51 కిలోల విభాగంలో ఫైనల్‌ బరిలో నిలిచిన నిఖత్‌ ముక్కుకు గాయం కారణంగా పోటీనుంచి తప్పుకోవడంతో ఆర్‌పీఎస్‌బీ బాక్సర్‌ జ్యోతి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. రైల్వేస్‌ నుంచి 48 కిలోల విభాగంలో నీతూ, 60 కిలోల కేటగిరీలో ప్రాచీ సైతం బంగారు పతకాలతో మెరిశారు. తెలంగాణ బాక్సర్లు నిహారిక గొనెళ్ల (60 కి.), యశీ శర్మ (65 కి.) కాంస్యాలు సాధించారు. భారత స్టార్‌ బాక్సర్‌ లవ్లీనా బోర్గొహెయిన్‌ (75 కి.) పసిడి గెలిచుకున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story