అదరగొడుతున్న ఫాఫ్ డు ప్లెసిస్

Faf du Plessis: దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ 40 ఏళ్ల వయసులోనూ టీ20 క్రికెట్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025 సీజన్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఫాఫ్, న్యూయార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో, 40 ఏళ్ల తర్వాత టీ20 క్రికెట్‌లో రెండు సెంచరీలు సాధించిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మన్‌గా ఫాఫ్ రికార్డు సృష్టించాడు. మొదట బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫాఫ్ కేవలం 53 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్లతో 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫాఫ్ డు ప్లెసిస్ చేసిన ఈ సెంచరీ అతని ఎనిమిదవ T20 సెంచరీ. ఈ సెంచరీతో, ఫాఫ్ మొత్తం 420 T20 మ్యాచ్‌లలో 11,755 పరుగులు చేశాడు. అతను ఇప్పటికే MLC 2025 సీజన్‌లో 7 ఇన్నింగ్స్‌లలో 317 పరుగులతో బ్యాటింగ్ చార్టులలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ సీజన్ ప్రారంభంలో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌పై 51 బంతుల్లో 100 పరుగులు చేశాడు. 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నప్పుడు గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన ఫాఫ్, ఎంఎల్‌సిలో తన ఫామ్‌ను తిరిగి పొందాడు. మొత్తం మీద, 40 ఏళ్ల మైలురాయిని దాటిన తర్వాత సెంచరీ చేసిన వారి జాబితాలో ప్లెసిస్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌కు చెందిన గ్రేమ్ హిక్ 41 ఏళ్ల 37 రోజుల్లో సెంచరీ సాధించగా, మరో ఇంగ్లీష్ క్రికెటర్ డర్హామ్ తరపున 2017లో 41 ఏళ్ల 65 రోజుల్లో ఈ ఘనత సాధించాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story