FIDE Chess World Cup: ఫిడే చెస్ వరల్డ్ కప్ షురూ
వరల్డ్ కప్ షురూ

FIDE Chess World Cup: ఫిడే చెస్ వరల్డ్ కప్ 2025 ఈ రోజు నుంచి గోవాలో ప్రారంభమైంది. ఇది అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) నిర్వహించే ప్రతిష్టాత్మక టోర్నమెంట్. నవంబర్ 1 నుంచి నవంబర్ 27 వరకు జరగనుంది.
ఇది పూర్తిగా సింగిల్ ఎలిమినేషన్ (నాకౌట్) ఫార్మాట్‌లో జరుగుతుంది, ఇందులో80 దేశాల నుంచి మొత్తం 206 మంది ఆటగాళ్లు పోటీపడతారు. ప్రతి రౌండ్‌లో రెండు క్లాసికల్ గేమ్‌లు ఉంటాయి. ఒకవేళ స్కోరు సమంగా ఉంటే, మూడో రోజు టై-బ్రేక్‌లు (రాపిడ్ లేదా బ్లిట్జ్) నిర్వహిస్తారు.
మొదటి 40 ఎత్తులకు 90 నిమిషాలు, ఆ తర్వాత మిగిలిన గేమ్‌కు 30 నిమిషాలు, ప్రతి ఎత్తుకు 30 సెకన్ల ఇంక్రిమెంట్ ఉంటుంది. ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్ సహా ప్రజ్ఞానంద, అర్జున్ ఎరిగైసి వంటి యువ గ్రాండ్‌మాస్టర్లతో పాటు పెంటేల హరికృష్ణ, విదిత్ గుజరాతీ వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా ఈ టోర్నమెంట్‌లో భారతదేశం తరఫున ఆడుతున్నారు.ఈ టోర్నీ విజేత, రన్నరప్ ,మూడో స్థానం పొందిన ఆటగాళ్లు 2026లో జరిగే క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తారు.

