FIFA World Cup: మెగా టోర్నీలో మెరుపులు మెరిపించిన స్వీడన్.. గోల్స్ వర్షంతో లీగ్‌లో బోణీ!
గోల్స్ వర్షంతో లీగ్‌లో బోణీ!

FIFA World Cup: గతంలో ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించడంలో విఫలమైన స్వీడన్.. ఈసారి మెరుపులు మెరిపించింది. మెగా టోర్నీలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ.. అదిరిపోయే విజయంతో బోణీ కొట్టింది. గ్రూప్–ఎఫ్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో స్వీడన్ 5–1 గోల్స్ తేడాతో ట్యూనీసియాపై ఘన విజయం సాధించింది.
మ్యాచ్ ప్రారంభం నుంచే స్వీడన్ ఆటగాళ్లు మైదానంలో పంజా విసిరారు. ట్యూనీసియాపై పూర్తి స్థాయిలో ఒత్తిడి పెంచుతూ దూకుడుగా ఆడారు. మ్యాచ్ కేవలం 7వ నిమిషంలోనే యాసిన్ అయారి స్వీడన్ ఖాతాలో తొలి గోల్ వేసి శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాత 30వ నిమిషంలో అలెగ్జాండర్ ఇసాక్.. 59వ నిమిషంలో విక్టర్ గైకోరెస్ అద్భుత గోల్స్‌తో స్వీడన్‌ను తిరుగులేని స్థితికి చేర్చారు.
ముఖ్యంగా అయాన్ లాంగ్ రేంజ్ షాట్స్‌తో రెచ్చిపోగా.. ఇసాక్, గ్యోకెరెస్ మంచి సమన్వయంతో కదులుతూ ట్యూనీసియా గోల్‌పోస్ట్‌పై సమర్థవంతంగా దాడి చేశారు. అయితే, మ్యాచ్ 43వ నిమిషంలో ట్యూనీసియా తరఫున ఒమర్ రెకిక్ ఏకైక గోల్ సాధించి కాస్త పోటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
ఇక మ్యాచ్ చివర్లో హై-డ్రామా నడిచింది. 84వ నిమిషంలో మథియాస్ స్వాన్‌బెర్గ్ కొట్టిన గోల్‌పై ఉత్కంఠ నెలకొనగా.. వీఏఆర్ (VAR) పరిశీలన తర్వాత అంపైర్లు దానిని గోల్‌గా ఖాయం చేశారు. ఆ తర్వాత మ్యాచ్ ముగిసే సరిగ్గా అదనపు టైమ్‌లో (90+6వ నిమిషంలో) యాసిన్ వ్యక్తిగతంగా రెండో గోల్ చేయడంతో స్వీడన్ 5-1తో భారీ విజయాన్ని అందుకుంది.ఈ భారీ విజయంతో స్వీడన్.. గ్రూప్-ఎఫ్ పట్టికలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. గతంలో క్వాలిఫై అవ్వలేదన్న విమర్శలకు.. గ్రౌండ్‌లోనే పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో సమాధానమిచ్చింది.
- SwedenSweden FootballFIFA World CupFootball NewsSoccer NewsGoal FestSweden VictoryWorld Cup 2026International FootballSports NewsFootball TournamentLeague OpenerMatch HighlightsSweden TeamFootball FansSports UpdateGlobal FootballWorld Cup ActionLatest Sports NewsLatest Telugu NewsSoccer HighlightsTournament News

