FIFA World Cup: వరల్డ్‌ కప్‌లో స్విట్జర్లాండ్ అదిరిపోయే ఆటతీరుతో టాప్ షో చూపెట్టింది. శుక్రవారం జరిగిన గ్రూప్‌–బి మ్యాచ్‌లో స్విస్ పడగ విప్పింది. 4–1 గోల్స్ తేడాతో బోస్నియా హెర్జెగోవినాను చిత్తు చేసింది. ఈ విజయంతో.. అంతకుముందు వరుసగా 9 మ్యాచ్‌ల్లో ఓటమి అనేది ఎరుగకుండా దూసుకుపోతున్న బోస్నియా జైత్రయాత్రకు ఎట్టకేలకు స్విస్ జట్టు బ్రేకులు వేసింది.

ఈ మ్యాచ్‌లో స్విస్ ఆటగాళ్లు గోల్స్ వర్షం కురిపించారు. జోహన్‌ మంజాంబి 74, 90వ నిమిషాల్లో రెండు గోల్స్ చేయగా.. రూబెన్‌ వర్గాస్‌ 84వ నిమిషంలో, కెప్టెన్ గ్రానిట్‌ హకా ఇంజూరీ టైమ్‌లో (90+7వ నిమిషంలో) సూపర్ గోల్స్ అందించి స్విస్‌ను విజేతగా నిలిపారు. ఇక బోస్నియా తరఫున ఎర్మిన్‌ మహ్మిక్‌ 90+3వ నిమిషంలో ఏకైక గోల్‌ చేశాడు.

స్విస్ టీమ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన 20 ఏళ్ల కుర్రాడు జోహన్‌ మంజాంబి.. తన క్లాసిక్ వ్యాలీ షాట్‌లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మరోవైపు బోస్నియా ప్లేయర్ తారిక్‌ ముహారెమోవిచ్‌‌ రెడ్‌ కార్డ్‌కు గురికావడం ఆ జట్టును కోలుకోలేని దెబ్బతీసింది. పది మందితోనే ఆడిన బోస్నియా బలహీనతను క్యాష్ చేసుకున్న స్విస్ ప్లేయర్లు.. మ్యాచ్‌ ఆఖరి నిమిషాల్లో చెలరేగిపోయారు.

అయితే, ఈ మ్యాచ్‌లో బోస్నియా ఓడిపోయినా.. ఆ జట్టు కెప్టెన్‌ ఎడిన్‌ డిజెకో సరికొత్త రికార్డు సృష్టించాడు. 40 ఏళ్లు పైబడిన వయసులో ప్రపంచకప్ మ్యాచ్ ఆడిన నాలుగో అవుట్‌ఫీల్డ్ ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇదివరకు లూకా మోడ్రిచ్, క్రిస్టియానో రొనాల్డో లాంటి దిగ్గజాలు మాత్రమే ఈ రేర్‌ ఫీట్‌ను సాధించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story