సిరస్ క్లీన్ స్వీప్ పై ఇండియా గురి

Fifth T20 Against Sri Lanka: ఈ రోజు భారత మహిళా క్రికెట్ జట్టుకు చాలా కీలకం. శ్రీలంకతో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా చివరి , ఐదో టీ20 జరగనుంది.గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతుంది.ఇప్పటికే భారత్ 4-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ రోజు మ్యాచ్ గెలిచి శ్రీలంకను క్లీన్ స్వీప్ (5-0) చేయాలని చూస్తోంది.మరో వైపు ఒక్క మ్యాచ్ అయినా గెలిచిన పరువు నిలపుకోవాలని లంక చూస్తోంది. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ లో పటిష్టంగా ఉన్నా..ఫీల్డింగ్ లో తడబడుతోంది. ఫీల్డింగ్ లో గనుక రాణిస్తే ఇండియా ఈ మ్యాచ్ గెలవడం చాలా ఈజీ

స్మృతి మంధానపై అందరి ఫోకస్

ఈ మ్యాచ్ స్మృతి మంధానకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకం. ఆమె ఈ మ్యాచ్‌లో 62 పరుగులు చేస్తే, 2025 క్యాలెండర్ ఇయర్‌లో పురుషులు, మహిళలు అందరిలోకీ కలిపి అత్యధిక పరుగులు (1,765+) చేసిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టిస్తారు. ప్రస్తుతానికి శుభ్‌మన్ గిల్ (1,764 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నారు. గత మ్యాచ్‌లోనే (4వ టీ20) ఆమె 80 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అదే జోరును నేడు కూడా కొనసాగిస్తే రికార్డు ఖాయం.

PolitEnt Media

PolitEnt Media

Next Story