First ODI Against Australia Tomorrow: రేపే ఆసిస్ తో తొలి వన్డే..అందరి ఫోకస్ ఆ ఇద్దరిపైనే
అందరి ఫోకస్ ఆ ఇద్దరిపైనే

First ODI Against Australia Tomorrow: రేపటి నుంచే టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కు శుభ్ మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది. నయా కెప్టెన్ గిల్ టీమిండియాను నడిపించనున్నాడు. . దాదాపు నాలుగు నెలల తర్వాత భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, కోహ్లీ వన్డే ఆడుతుండటంతో ఈ మ్యాచ్ పై భారీగా అంచనాలు ఉన్నాయి.
అక్టోబర్ 19న మొదటి వన్డే పెర్త్ స్టేడియంలో జరగనుంది. రెండవ వన్డే అక్టోబర్ 23 అడిలైడ్ ఓవల్ లో..మూడో వన్డే సిడ్నీ గ్రౌండ్ లో జరగనుంది. వన్డే సిరీస్ ముగిసిన వెంటనే, అక్టోబర్ 29 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది, దీనికి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఇండియా జట్టు (అంచనా)
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, యశస్వి జైస్వాల్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ
ఆస్ట్రేలియా జట్టు (అంచనా)
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లాబుస్చాగ్నే, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్
