నితీశ్ కు దక్కని చోటు

No Place for Nitish: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ ఆల్‌రౌండర్‌ నితీశ్ కుమార్ రెడ్డికి దక్షిణాఫ్రికాతో జరగబోయే తొలి టెస్టు మ్యాచ్‌కు భారత జట్టులో చోటు దక్కలేదు. కోల్‌కతాలో (ఈడెన్ గార్డెన్స్) రేపటి నుంచి ప్రారంభమయ్యే సౌతాఫ్రికాతో జరిగే తొలి టెస్టు జట్టుకు నితీశ్ ను ఎంపిక చేయలేదు. నితీశ్ ను రాజ్‌కోట్‌లో నవంబర్ 13 నుంచి 19 వరకు జరగనున్న సౌతాఫ్రికా 'A' జట్టుతో వన్డే సిరీస్ కోసం భారత్ 'A' జట్టులో చేరాలని ఆదేశించారు.A' సిరీస్ ముగిసిన తర్వాత, నవంబర్ 22 నుంచి గౌహతిలో జరగనున్న రెండో టెస్టు కోసం నితీశ్ మళ్లీ సీనియర్ జట్టుతో కలుస్తారని BCCI తెలిపింది.

రాబోయే విదేశీ పర్యటనల కోసం నితీశ్‌ను సిద్ధం చేయాలని BCCI భావిస్తోంది. అయితే, తొలి టెస్టులో ప్లేయింగ్ XIలో అతనికి స్థానం దొరకదని దాదాపు ఖరారైనందున, కేవలం బెంచ్‌కే పరిమితం కాకుండా, భారత్ 'A' జట్టు తరఫున ఆడటం ద్వారా తగిన మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుందని మేనేజ్‌మెంట్ భావించింది.

యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధ్రువ్ జురెల్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం (సౌతాఫ్రికా 'A'పై వరుస సెంచరీలు) జట్టు కూర్పులో మార్పులకు దారితీసింది. రిషబ్ పంత్ కూడా జట్టులోకి తిరిగి రావడంతో, జురెల్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఈ మార్పుల వల్ల నితీశ్ స్థానానికి ఎసరొచ్చింది. నితీశ్‌కు రెండవ టెస్టులోనైనా అవకాశం లభించాలని అతని అభిమానులు ఆశిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story