టీ20 క్రికెట్ చరిత్రలో ప్రియాందన్ ప్రపంచ రికార్డ్

అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను ఇండోనేషియా బౌలర్ గేడ్ ప్రియందన సాధించారు. బాలి వేదికగా కాంబోడియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఆయన ఒకే ఓవర్‌లో ఏకంగా 5 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించారు. కాంబోడియా ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో ప్రియందన ఈ ఘనత సాధించారు.ఓవర్ లో మొదటి బంతికి వికెట్ (షా అబ్రార్ హుస్సేన్), రెండో బంతికి వికెట్ (నిర్మల్‌జిత్ సింగ్), మూడో బంతికి వికెట్ (హ్యాట్రిక్ - చాంతోయున్ రతనాక్)

నాలుగో బంతి డాట్ బాల్ వైడ్ 1 పరుగు వచ్చింది. ఐదో బంతికి వికెట్ (మోంగ్‌దర సోక్),ఆరో బంతికి (పెల్ వెన్నక్) వికెట్ తీశారు. మొత్తం ఒక ఓవర్లో ఒక పరుగు ఇచ్చి - 5 వికెట్లు తీశారు.

అంతర్జాతీయ టీ20ల్లో (పురుషుల/మహిళల విభాగాల్లో) ఒకే ఓవర్‌లో 5 వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా ప్రియందన నిలిచారు. గతంలో లసిత్ మలింగ, రషీద్ ఖాన్, కర్టిస్ కాంఫర్, జేసన్ హోల్డర్ వంటి ప్రముఖులు ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీశారు. కానీ, ఐదు వికెట్ల మార్కును చేరడం ఇదే మొదటిసారి. భారత బౌలర్ అభిమన్యు మిథున్ (సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో), బంగ్లాదేశ్ బౌలర్ అల్ అమీన్ హుస్సేన్ గతంలో దేశవాళీ టీ20ల్లో ఈ ఘనత సాధించారు. ఇండోనేషియా ఈ మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు ఇండోనేషియా తరపున ధర్మ కేసుమా (110 నాటౌట్) సెంచరీతో రాణించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story