రహానే సలహా

Rahane's Advice to Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండిడియా ఆసియా కప్ 2025లో బరిలోకి దిగుతోంది. సెప్టెంబర్ 10న యూఏఈతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో, సీనియర్ ఆటగాడు అజింక్య రహానే.. సూర్యకుమార్ యాదవ్‌కు కీలక సలహా ఇచ్చారు. కెప్టెన్సీ కంటే బ్యాటింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టడం ద్వారా ఆసియా కప్‌ను సులభంగా గెలవచ్చని అభిప్రాయపడ్డారు.

సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ కీలకం

"ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ ఫామ్ కోల్పోయాడు. కానీ ఐపీఎల్ 2025లో ఐదు హాఫ్ సెంచరీలు చేసి రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి స్ట్రైక్‌రేట్ కూడా చాలా బాగుంది. ఒక్కసారి కుదురుకుంటే సూర్య ఎంత ప్రమాదకరమైన బ్యాటరో మనందరికీ తెలుసు. అయితే సర్జరీ తర్వాత అతడు ఎలా ఆడతాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది" అని రహానే అన్నారు.

సూర్యకు కెప్టెన్సీ నైపుణ్యాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించిన రహానే, ఆసియా కప్‌లో అతడి బ్యాటింగ్ చాలా ముఖ్యమని తెలిపారు. సూర్యకుమార్‌తో పాటు జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఈ టోర్నమెంట్‌లో కీలక పాత్ర పోషిస్తారని అంచనా వేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story