మహిళా రిఫరీని చెంప దెబ్బ కొట్టిన ప్లేయర్

Football: కొలంబియాలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ లో ప్లేయర్ జేవియర్ బొలివర్ మహిళా రిఫరీని చెంపదెబ్బ కొట్టిన షాకింగ్ ఘటన జరిగింది. వెనెస్సా సెబాలోస్ వేదికగా జరిగిన రియల్ అలియాంజా కాటాక్వెరా, డిపోర్టివో క్విక్ మధ్య మ్యాచ్ మధ్యలో లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫెలిపే బోలివర్ రిఫరీ వెనెస్సా సెబాలోస్ పై కోపంతో ఆమె చెంప దెబ్బ కొట్టాడు. ఈ ఘటనతో సీరియస్ అయిన రిఫరీ, ఆటగాడిని తిరిగి కొట్టడానికి ప్రయత్నించింది. కానీ, అక్కడ ఉన్న ఇతర ఆటగాళ్లు ఆమెను అడ్డుకున్నారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఘటనపై బోలివర్ క్షమాపణలు చెప్పాడు. ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని, ఆమె నోటి నుండి విజిల్ ను లాగే ప్రయత్నంలో పొరపాటున చెంప తగిలిందని వివరించాడు. ఈ ఘటన క్రీడా ప్రపంచంలో తీవ్ర చర్చకు దారితీసింది. అతడిని ఆట నుంచి సస్పెండ్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ ఘటన క్రీడల్లో మహిళా రిఫరీలకు ఎదురవుతున్న సవాళ్లను మరోసారి హైలైట్ చేసింది. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని, ఇలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరాదని పలు క్రీడా సంఘాలు, ప్రముఖులు ఖండిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story