ఎక్కడంటే.?

World Boxing Cup Finals: నవంబర్ 14 నుంచి వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025 భారత్‌లో జరగనున్నాయి. ఇది భారత బాక్సింగ్‌కు ఒక ముఖ్యమైన ఘట్టం.

గ్రేటర్ నోయిడా ఢిల్లీలో నవంబర్ 14 నుంచి నవంబర్ 21వరకు జరగనున్నాయి. భారత్ ఈ ప్రతిష్టాత్మక వరల్డ్ బాక్సింగ్ ఈవెంట్ ఫైనల్స్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి.

ఇండియా ఆతిథ్యం ఇస్తున్న ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో 18 దేశాల నుంచి 140 మందికి పైగా టాప్ బాక్సర్లు పోటీ పడనున్నారు. ఈ టోర్నమెంట్‌కు భారత్ తరపున బలమైన 20 మంది సభ్యుల (10 మంది పురుషులు, 10 మంది మహిళలు) జట్టు బరిలోకి దిగనుంది. భారత స్టార్ బాక్సర్లు .. నిఖత్ జరీన్ (మాజీ ప్రపంచ ఛాంపియన్), జాస్మిన్ లంబోరియా,మీనాక్షి, పూజా రాణి (రెండుసార్లు ఆసియా ఛాంపియన్), సావీటి బూరా (మాజీ ప్రపంచ ఛాంపియన్), ఈ ఈవెంట్ ద్వారా బాక్సర్లు ఎక్కువ ర్యాంకింగ్ పాయింట్లను సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు, ఇది రాబోయే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల వంటి మెగా ఈవెంట్లకు సీడింగ్‌లో సహాయపడుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story