Tennis: టెన్నిస్ చరిత్రలోనే తొలిసారి..ఎవరీ అల్కరాజ్..?
ఎవరీ అల్కరాజ్..?

Tennis: స్పెయిన్ గడ్డ నుంచి కొత్త కుర్రాడు వస్తూనే చరిత్ర సృష్టించాడు.19ఏండ్లకే వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్అందుకుని ఇంకో మూడేండ్లు తిరిగే సరికి ఐదు గ్రాండ్ స్లామ్స్ ఖాతాలోవేసుకుని మెన్స్ టెన్సిస్ లో చరిత్ర సృష్టించాడు అతడే కార్లోస్ అల్కరాజ్. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోఅసాధారణ పోరాట పటిమ చూపెట్టిన 22 ఏండ్ల కార్లోస్ స్పెయిన్ నడాల్ వారసుడిగా పేరు పొందుతున్నాడు.
కెరీర్ లో తన ఐదో గ్రాండ్లమ్ గెలిచే నాటికి కార్లోస్ అల్కరాజ్ వయసు 22 సంవత్సరాల 1 నెల 3 రోజులు. లెజెండరీ ఆటగాడు రఫెల్ నడాల్ తన ఐదో గ్రాండ్లామ్ (2008 వింబుల్డన్) గెలుచుకున్నప్పుడు అతని వయసు కూడా సరిగ్గా 22 ఏండ్ల 1 నెల 3 రోజులు. ఒకే దేశానికి చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఐదు మేజర్ టైటిళ్ల మైలురాయిని సరిగ్గా ఒకే వయసులో అందుకోవడం టెన్నిస్ చరిత్రలోనే ఇది తొలిసారి. ఈ విషయం అల్కరాజ్ తన ఆరాధ్య ఆటగాడు నడాలకు అసలైన వారసుడని మరోసారి రుజువు చేసిందని అనొచ్చు.
స్పెయిన్లోని ఎల్ పాల్మార్ అనే చిన్న పట్టణంలో పుట్టిన అల్కరాజ్కు టెన్నిస్ అంటే పిచ్చి. తండ్రి కార్లోస్ అల్కరాజ్ గొంజాలెజ్ కోచ్ కావడంతో ఊహతెలిసే సమయానికే టెన్నిస్ రాకెట్ కార్లోస్ నేస్తం అయింది. నాలుగేండ్ల వయసులోనే తండ్రి మార్గదర్శకత్వంలో ఆటను నేర్చుకోవడం మొదలు పెట్టాడు. మాజీ వరల్డ్ నంబర్ వన్ జువాన్ కార్లోస్ ఫెర్రెరో శిక్షణలో చేరిన తర్వాత ఆటలో రాటుదేలాడు. 2022లో మయామి, మాడ్రిడ్ వంటి ప్రతిష్టాత్మక మాస్టర్స్ టై టిళ్లను గెలుచుకొని ఔరా అనిపించాడు. అదే ఏడాది మాడ్రిడ్ ఓపెన్లో క్లే కోర్టుపై నడాల్, జొకోవిచ్ను వరుస మ్యాచ్లలో ఓడించి సంచలనం సృష్టించాడు. 2022 యూఎస్ ఓపెన్లో తొలి గ్రాండ్లమ్ గెలిచి, 19 ఏండ్లకే టెన్నిస్ చరిత్రలోనే యంగెస్ట్ వరల్డ్ నంబర్ వన్ అయ్యాడు. 2023 వింబుల్డన్ గ్రాస్ కోర్టుపై రారాజుగా వెలుగొందుతున్న జొకోవిచ్ ను ఫైనల్లో ఓడించి ఈ తరం ఆటగాళ్లలో తానెంత ప్రత్యేకమో నిరూపించుకున్నాడు. 2024లో టైటిల్ ను నిలబెట్టుకున్న కార్లోస్ తాను అక్కడితో ఆగిపోగా 2025 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను దక్కించుకున్నాడు.
