Team India Squad: వెస్టిండీస్ సిరీస్ కు టీమిండియా జట్టు...కరుణ్ నాయర్, నితీశ్ రెడ్డి అవుట్
కరుణ్ నాయర్, నితీశ్ రెడ్డి అవుట్

Team India Squad: వెస్టిండీస్‌తో స్వదేశంలో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా వ్యవహరించనున్నారు.
గాయం కారణంగా రిషబ్ పంత్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ ప్రధాన వికెట్ కీపర్‌గా, ఎన్. జగదీశన్ బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యారు. అలాగే, ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించని కరుణ్ నాయర్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డికి కూడా జట్టులో అవకాశం లభించింది.
ఈ సిరీస్ అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. మొదటి టెస్ట్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో, రెండో టెస్ట్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది.
భారత జట్టు (టెస్టు సిరీస్):
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్),యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్,సాయి సుదర్శన్,దేవదత్ పడిక్కల్,ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్),రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్),వాషింగ్టన్ సుందర్,జస్‌ప్రీత్ బుమ్రా,అక్షర్ పటేల్,నితీష్ కుమార్ రెడ్డి,ఎన్. జగదీశన్ (వికెట్ కీపర్),ప్రసిద్ధ్ కృష్ణ,మహ్మద్ సిరాజ్,కుల్దీప్ యాదవ్
