అభిషేక్‌కు సెహ్వాగ్ సూచన

Former cricketer Virender Sehwag: పాకిస్థాన్‌పై ఆసియా కప్‌లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన భారత ఓపెనర్ అభిషేక్ శర్మపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రశంసలు కురిపించారు. మ్యాచ్ అనంతరం వీరిద్దరి మధ్య జరిగిన చిట్‌చాట్‌లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సెహ్వాగ్‌తో తనను పోల్చడంపై అభిషేక్ శర్మ స్పందిస్తూ.. "ప్రస్తుత పాకిస్థాన్ బౌలింగ్‌లో పెద్దగా పస లేదు. కానీ సెహ్వాగ్ ఆడిన కాలంలో బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం. అలాంటి బౌలింగ్‌లోనే సెహ్వాగ్‌ భారీ షాట్లు కొట్టేవారుఅని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అభిషేక్ చేసిన ప్రశంసకు సంతోషించిన సెహ్వాగ్.. యువ బ్యాటర్‌కు కీలకమైన సూచన ఇచ్చారు. సునీల్ గావస్కర్‌ తనకు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ.. "నువ్వు ఎప్పుడైతే 70 లేదా 80 పరుగులకు చేరుకుంటావో అప్పుడు సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోవద్దు. రిటైర్ అయిన తర్వాత ఇలాంటి ఇన్నింగ్స్‌లే గుర్తొస్తుంటాయి. 'అరే, సెంచరీ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అందుకే ఇలాంటి ఇన్నింగ్స్‌లను శతకాలుగా మార్చుకోవాలి. అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. నీదైన రోజున నాటౌట్‌గా ఉండేందుకు ప్రయత్నించు" అని సెహ్వాగ్‌ సలహా ఇచ్చారు. పాకిస్థాన్‌పై అభిషేక్ శర్మ 39 బంతుల్లో 74 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story