ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Former England spinner Monty Panesar: ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ చేసిన శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ ఆటతీరును పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. గిల్ క్రీజులో ఉన్నప్పుడు చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటాడని, అది ఒక్కోసారి బద్ధకంలా కనిపిస్తుందని పనేసర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో లేదా వికెట్ల మధ్య పరుగెత్తేటప్పుడు కోహ్లీలో ఉండే "చురుకుదనం" గిల్‌లో లేదని అన్నాడు. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ చేయడం అతనికి భారమని అన్నారు. టెస్టుల్లో నిలదొక్కుకోవాలంటే దేశవాళీ క్రికెట్ బలోపేతం కావాలని సూచించారు.

విరాట్ కోహ్లీ మైదానంలో చూపే తీవ్రత (Intensity), ప్రతి బంతికి స్పందించే తీరు అద్భుతంగా ఉంటుంది. గిల్ ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదని, కోహ్లీలా దూకుడుగా (Aggressive) ఉండలేడని పనేసర్ విమర్శించారు.పనేసర్ విమర్శ అలా ఉన్నప్పటికీ, చాలా మంది క్రికెట్ విశ్లేషకులు గిల్ ఆటతీరును మరోలా చూస్తారు

గిల్ బ్యాటింగ్ శైలి సహజంగానే "ఎఫర్ట్‌లెస్" (Effortless) గా ఉంటుంది. రోహిత్ శర్మలాగే గిల్‌కు కూడా బంతిని ఆడటానికి ఎక్కువ సమయం ఉన్నట్లు కనిపిస్తుంది. దీనిని కొందరు బద్ధకం అని పొరబడే అవకాశం ఉంది. గిల్ చాలా ప్రశాంతంగా ఆడుతుంటాడు. కోహ్లీది "హాట్" టెంపరామెంట్ అయితే, గిల్‌ది "కూల్" టెంపరామెంట్. విరాట్ కోహ్లీ తన కెరీర్ ఆరంభంలో ఇంత ఫిట్‌గా, ఇంత దూకుడుగా లేడు. కాలక్రమేణా తనను తాను మార్చుకున్నాడు. గిల్ ఇప్పుడిప్పుడే తనను తాను నిరూపించుకుంటున్నాడు.గిల్ తన ఫిట్‌నెస్, ఫీల్డింగ్ విషయంలో కోహ్లీని స్ఫూర్తిగా తీసుకోవాలని చాలామంది మాజీలు సూచిస్తున్నారు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం ఆడాలంటే పనేసర్ చెప్పినట్లు "చురుకుదనం" చాలా అవసరమని చెబుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story