Former Head Coach Ravi Shastri: అలాంటి వాళ్ళకు విదేశీ లీగ్ లు ఆడేందుకు అనుమతించాలి
విదేశీ లీగ్ లు ఆడేందుకు అనుమతించాలి

Former Head Coach Ravi Shastri: భారత క్రికెట్ జట్టు మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఎక్కువ మంది భారత ఆటగాళ్లను విదేశీ లీగ్‌లలో ఆడేందుకు అనుమతించాలన్నారు. అయితే, ఆయన ఈ మద్దతును ముఖ్యంగా BCCI కాంట్రాక్ట్‌లో లేని యువ ఆటగాళ్లను ఉద్దేశించి అన్నారు
విదేశీ లీగ్‌లలో ఆడటం ద్వారా యువ ఆటగాళ్లకు "అద్భుతమైన ఎక్స్‌పోజర్" లభిస్తుంది. అంతర్జాతీయ స్టార్లతో కలిసి ఆడటం, డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం, రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ వంటి దిగ్గజాల కోచింగ్ సిబ్బందితో పనిచేయడం వల్ల వారి క్రికెట్ పరిజ్ఞానం పెరుగుతుందన్నారు.
విదేశాల్లో ఆడేటప్పుడు వివిధ పరిస్థితులు,ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటారు. ఐపీఎల్ దీనికి మంచి ఉదాహరణ అని, విదేశీ లీగ్‌లు కూడా అదే విధంగా ఆటగాళ్లకు ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అన్నారు.భారతదేశంలో జనాభా చాలా ఎక్కువ. కేవలం 11 మందికే జాతీయ జట్టులో అవకాశం దొరుకుతుంది. మిగిలిన ప్రతిభావంతులు దేశీయ క్రికెట్‌లో లేదా 'C' లేదా 'D' స్థాయి కాంట్రాక్ట్‌లలో ఉండిపోతే, వారిని విదేశీ లీగ్‌లలో ఆడకుండా ఎందుకు ఆపాలని ఆయన ప్రశ్నించారు. ఇది వారికి జీవనోపాధి,ఆదాయ వనరు.విదేశాల్లో ఆడటం అనేది ఒక "విద్య" లాంటిది. వివిధ దేశాల శిక్షణా పద్ధతులు, సంస్కృతులు ఆటగాళ్లకు కొత్త విషయాలను నేర్పుతాయి అని రవిశాస్త్రి అన్నారు.
