Former Indian cricketer Ambati Rayudu: 40 ఏళ్ల వయసులో తండ్రైన తెలుగు క్రికెటర్
తండ్రైన తెలుగు క్రికెటర్

Former Indian cricketer Ambati Rayudu: భారత మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య చెన్నుపల్లి విద్య మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన వార్తను రాయుడు స్వయంగా సోషల్ మీడియా (ఇన్‌స్టాగ్రామ్) వేదికగా అభిమానులతో పంచుకున్నారు. రాయుడు దంపతులకు ఇది మూడవ సంతానం. ఇప్పటికే వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు కుమారుడు (వారసుడు) పుట్టడంతో రాయుడు కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి.
రాయుడు తన కళాశాల స్నేహితురాలైన విద్యను 2009, ఫిబ్రవరి 14న వివాహం చేసుకున్నారు. 2020 జూలైలో పెద్ద కుమార్తె వివియా జన్మించింది. 2023 మే నెలలో రెండవ కుమార్తె పుట్టింది. రాయుడు ఆసుపత్రిలో తన భార్య, తన బిడ్డతో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ, "మా కుటుంబంలోకి కొత్త సభ్యుడు వచ్చాడు" అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు నెటిజన్లు, మాజీ క్రికెటర్లు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
2013లో జింబాబ్వేపై 27 ఏళ్ల వయసులో వన్డేల్లో అడుగుపెట్టాడు. 55 వన్డేల్లో 47.05 సగటుతో 1,694 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి.ప్రస్తుతం రాయుడు అంతర్జాతీయ క్రికెట్ ,ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, కామెంటేటర్‌గా, పలు క్రికెట్ లీగ్‌లలో చురుకుగా పాల్గొంటున్నారు.

