పాక్ మాజీ కెప్టెన్ సర్పరాజ్ గుడ్ బై

Former Pakistan Captain Sarfaraz Ahmed: క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. మూడు ఫార్మా్ట్ల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో ఆయన పాత్ర మరువలేనిది.ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్‌పై పాకిస్తాన్‌ను విజేతగా నిలిపి, ట్రోఫీని అందించారు.ఆయన కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టు సుదీర్ఘ కాలం పాటు టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగింది.2006లో సర్ఫరాజ్ సారథ్యంలోనే పాకిస్తాన్ అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకుంది.చురుకైన వికెట్ కీపర్‌గా మాత్రమే కాకుండా, మిడిల్ ఆర్డర్‌లో కీలక పరుగులు సాధించి జట్టును ఆదుకునేవారు. సర్పరాజ్ అహ్మద్ 54 టెస్టులు ఆడి నాలుగు సెంచరీలు, 3,031 పరుగులు,117 వన్డేల్లో 2 సెంచరీలు, 2,315 పరుగులు,61 టీ20ల్లో 818 పరుగులు చేశారు.

వీడ్కోలుకు కారణం?

గత కొంతకాలంగా జట్టులో స్థానం కోసం సర్ఫరాజ్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మహ్మద్ రిజ్వాన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో సర్ఫరాజ్‌కు తుది జట్టులో అవకాశాలు తగ్గిపోయాయి. దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో పునరాగమనం కష్టమని భావించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్ఫరాజ్ అహ్మద్ కేవలం ఆటగాడిగానే కాకుండా, మైదానంలో తనదైన శైలిలో ఆటగాళ్లను ఉత్సాహపరిచే నాయకుడిగా గుర్తింపు పొందారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story