Former Team India captain Rohit Sharma: ఇంట్లో కూర్చొని వరల్డ్ కప్ చూడటం కొత్తగా ఉంది
వరల్డ్ కప్ చూడటం కొత్తగా ఉంది

Former Team India captain Rohit Sharma: టీ20 వరల్డ్ కప్ గురించి టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా 2024 టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత ఆయన అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2026 టీ20 వరల్డ్ కప్‌కు రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్‌గా ఐసీసీ నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "నేను ఇప్పటి వరకు జరిగిన అన్ని టీ20 వరల్డ్ కప్ ఎడిషన్లలోనూ ఆడాను. కానీ వచ్చే వరల్డ్ కప్‌ను ఇంటి దగ్గర కూర్చుని టీవీలో చూడటం అనేది నాకు చాలా వింతగా అనిపిస్తుంది. టీమిండియా ప్రస్తుత ఫామ్ చూస్తుంటే 2026 వరల్డ్ కప్‌లో కూడా భారత్ కచ్చితంగా ఫైనల్స్‌కు చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆటగాడిగా మైదానంలో ఉండకపోయినా, అంబాసిడర్‌గా ఈ టోర్నీని ప్రమోట్ చేయడం సంతోషంగా ఉందని చెప్పారు.
వరల్డ్ కప్ గెలవడమే నా ప్రధాన లక్ష్యంగా ఉండేది. ఆ ట్రోఫీ చేతికి అందగానే ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది.జట్టులో ప్రతి ఆటగాడితో పారదర్శకమైన కమ్యూనికేషన్ ఉండాలని, అప్పుడే జట్టుగా విజయం సాధించగలమని ఆయన పేర్కొన్నారు.టీ20ల నుండి తప్పుకున్నా, తన దృష్టి అంతా ప్రస్తుతం వన్డే ఫార్మాట్ (ముఖ్యంగా 2027 వరల్డ్ కప్) పైనే ఉందని స్పష్టం చేశారు.
రోహిత్ శర్మ 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే ఆ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు.ఆయన నాయకత్వంలో భారత్ 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకుంది.

