ట్రోఫీ ఎందుకు గెలవలేదంటే.?

Former Team India captain Rohit Sharma: ఐసీసీ ట్రోఫీలు, టీమిండియా సాధించిన విజయాలపై రోహిత్ శర్మ జూహోట్‌స్టార్ షోలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2011 నుండి 2024 వరకు సాగిన 13 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణపై ఆయన తన విశ్లేషణను పంచుకున్నారు.భారత్ సుదీర్ఘకాలం ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడానికి ప్రధాన కారణం "ఓటమి భయం" అని రోహిత్ అభిప్రాయపడ్డారు."మేము సరైన పనులే చేస్తున్నామని నమ్మాము, కానీ ఏదో లోపించింది. బహుశా మా అందరిలోనూ ఓటమి భయం చేరి ఉండవచ్చు, అని అన్నారు.

వ్యక్తిగత స్కోర్ల కంటే జట్టు విజయమే ముఖ్యమని 2019 ప్రపంచకప్ తనకు నేర్పిందని రోహిత్ చెప్పారు.2019 వరల్డ్ కప్‌లో నేను ఐదు సెంచరీలు చేసినా ట్రోఫీ గెలవలేదు. అప్పుడు నా మనసులో ఒక ప్రశ్న మెదిలింది - ఈ పరుగుల వల్ల ఉపయోగం ఏముంది? అప్పుడే నా ఆలోచనా విధానం మారింది. 2020 నుండి తన ఆటలో స్వార్థం లేకుండా, జట్టు కోసం "భయం లేని క్రికెట్" ఆడటంపై దృష్టి పెట్టానని ఆయన వెల్లడించారు.

నాయకుడిగా తాను ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు.ఓటమి భయాన్ని పోగొట్టాలంటే ఆటగాళ్లకు భరోసా ఇవ్వాలి. 'మీరు వెళ్లి ఆడండి, ఏం జరిగినా నేను మీకు తోడుంటాను' అని ప్రతి ఆటగాడికి క్లారిటీ ఇచ్చాను. దీనివల్ల ఆటగాళ్ల మధ్య బలమైన బంధం ఏర్పడింది.

ప్రస్తుతం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, త్వరలో జరగనున్న 2026 టీ20 ప్రపంచకప్‌ను టీవీలో చూడటంపై స్పందించారు.ప్రతి టీ20 వరల్డ్ కప్‌లో నేను భాగమయ్యాను. మొదటిసారి ఇంటి దగ్గర కూర్చొని చూడటం కొంచెం వింతగా (weird) అనిపిస్తుంది. కానీ నేను స్టేడియంకు వచ్చి జట్టును ప్రోత్సహిస్తాను," అని పేర్కొన్నారు.

రోహిత్ శర్మ సారథ్యంలో2024 టీ20 వరల్డ్ కప్: విజేతగా నిలిచింది.2025 ఛాంపియన్స్ ట్రోఫీ: కివీస్‌ను ఫైనల్‌లో ఓడించి ట్రోఫీ కైవసం చేసుకుంది. వరుసగా మూడు ఐసీసీ టోర్నీల్లో (2023 వన్డే వరల్డ్ కప్ - రన్నరప్ తో కలిపి) భారత్ 23 మ్యాచ్‌లలో 22 విజయాలు సాధించిన గొప్పతనాన్ని రోహిత్ గుర్తుచేసుకున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story