International Cricket Council Team: ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నీలో భారత్ నుంచి నలుగురు
భారత్ నుంచి నలుగురు

International Cricket Council Team: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో వరుసగా భారత్ రెండోసారి (Back-to-back) ప్రపంచ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీ ముగిసిన మరుసటి రోజే ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ను అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టులో భారత్ నుండి నలుగురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.
టోర్నీలో అత్యుత్తమంగా రాణించిన సంజు శాంసన్ (321 పరుగులు), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా (14 వికెట్లు) ఈ జట్టులో ఎంపికయ్యారు. భారత జట్టుకు కప్పు అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఈ జట్టులో చోటు దక్కించుకోలేదు. దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్రామ్‌ను ఐసీసీ కెప్టెన్‌గా ఎంపిక చేసింది.టోర్నీలో రెండు సెంచరీలు చేసిన పాకిస్తాన్‌కు చెందిన సాహిబ్జాదా ఫర్హాన్ ఓపెనర్‌గా ఎంపికయ్యారు. బుమ్రాతో పాటు జింబాబ్వే పేసర్ ముజరబానీ, ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 - టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్
సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్తాన్), శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, మార్‌క్రమ్ (కెప్టెన్ - సౌతాఫ్రికా), హార్దిక్ పాండ్యా , విల్ జాక్స్ (ఇంగ్లండ్), జేసన్ హోల్డర్ (వెస్టిండీస్), బుమ్రా , ఎంగిడి (సౌతాఫ్రికా), అదిల్ రషీద్ (ఇంగ్లండ్), ముజరబానీ (జింబాబ్వే). 12వ ప్లేయర్: షాడ్లీ వాన్ షాల్క్‌విక్ (యూఎస్‌ఏ).

