జట్టులోకి అన్షల్ కాంబోజ్.!

Fourth Test Against England: జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు పేసర్లు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్ దీప్ గాయాల కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం డౌట్ గా మారింది. అర్ష్‌దీప్‌కు ప్రాక్టీస్ సమయంలో ఎడమ చేతికి గాయం కాగా, ఆకాశ్ దీప్‌కు గజ్జల్లో గాయం అయినట్లు తెలుస్తోంది.

దీంతో ముందు జాగ్రత్తగా బీసీసీఐ యువ పేసర్ అన్షుల్ కాంబోజ్ ను జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన అనధికారిక టెస్టుల్లోనూ, దేశవాళీ క్రికెట్‌లోనూ అన్షుల్ ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్ ముందే వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిస్తారని వార్తలు వచ్చాయి. కానీ సిరీస్ ప్రస్తుతం 2-1తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉండడంతో బుమ్రా ఆడటం తప్పనిసరి అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

నాలుగో టెస్టుకు భారత పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ అన్షుల్ కాంబోజ్ అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. ఫైనల్ జట్టుపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story