French Open: ఫ్రెంచ్ ఓపెన్: తొలిసారి క్వార్టర్స్‌లోకి కలిన్‌స్కాయా
తొలిసారి క్వార్టర్స్‌లోకి కలిన్‌స్కాయా

French Open: ఫ్రెంచ్ ఓపెన్ క్లే కోర్టుపై హోరాహోరీ పోరు సాగుతోంది! సంచలన విజయాలు, ఉత్కంఠభరిత మ్యాచ్‌లతో టోర్నమెంట్ క్లైమాక్స్‌కు చేరుకుంది.రష్యా టెన్నిస్ స్టార్ అన్నా కలిన్‌స్కాయా సరికొత్త చరిత్ర సృష్టించింది. సుజానే-లెంగ్లెన్ కోర్టులో దాదాపు మూడు గంటల పాటు సాగిన నరాలు తెగే ఉత్కంఠ పోరులో.. ఆస్ట్రియాకు చెందిన అనస్తాసియా పొటపోవాపై ఆమె అద్భుత విజయం సాధించింది.
నిర్ణయాత్మక మూడో సెట్ సూపర్ టైబ్రేకర్‌లో 4-1తో వెనుకంజలో ఉన్నప్పటికీ.. కలిన్‌స్కాయా ఫీనిక్స్ పక్షిలా పుంజుకుని మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఆమె కెరీర్‌లో ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి!
ఇటలీ ఆశలు సజీవం
పురుషుల సింగిల్స్‌లో హాట్ ఫేవరెట్ జాన్నిక్ సిన్నర్ రెండో రౌండ్‌లోనే నిష్క్రమించి షాక్ ఇచ్చినప్పటికీ.. ఇటలీ అభిమానులకు ఫ్లావియో కోబొల్లి కొత్త ఆశలు చిగురింపజేశాడు. పదో సీడ్ కోబొల్లి.. అమెరికా ఆటగాడు జకారీ స్వైడాపై నాలుగు సెట్ల సుదీర్ఘ పోరాటంలో విజయం సాధించి, కెరీర్‌లో రెండోసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు.స్కోరు: 6–2, 6–3, 6–7 (3), 7–6 (5)
తదుపరి రౌండ్‌లో ఫెలిక్స్ ఆగర్-అలియాసిమ్ లేదా అలెజాండ్రో టాబిలోలలో ఒకరితో కోబొల్లి తలపడనున్నాడు. అలాగే ఇటలీకే చెందిన బిగ్-సర్వర్ మాటెయో బెర్రెట్టిని సైతం జువాన్ మాన్యువల్ సెరుండోలోతో జరిగే తదుపరి మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు.
నైట్ సెషన్‌లో బిగ్ ఫైట్
ఇక మహిళల విభాగంలో అత్యంత ఆసక్తికరమైన పోరుకు తెరలేవబోతోంది. గతేడాది రన్నరప్, టాప్ సీడ్ అరీనా సబలెంక.. మాజీ వరల్డ్ నంబర్ వన్ నయోమి ఒసాకాతో తలపడనుంది. గత మూడేళ్లలో ఫ్రెంచ్ ఓపెన్‌లో రాత్రి వేళ (Night Session) జరుగుతున్న తొలి మహిళల మ్యాచ్ ఇదే కావడం విశేషం! ఇద్దరు దిగ్గజాల మధ్య జరగబోయే ఈ పోరుపై ప్రపంచవ్యాప్తంగా టెన్నిస్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

