Gajendra Rawal: నా బిడ్డకు మెడల్ రావడానికి జై షానే కారణం
జై షానే కారణం

Gajendra Rawal: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 గెలిచిన భారత జట్టులో ప్రతీక రావల్‌కు మెడల్ (పతకం) లభించకపోవడంపై మొదట నిరాశ వ్యక్తమైంది.
ఫైనల్‌కు ముందు గాయం కారణంగా ప్రతీక రావల్ టోర్నమెంట్ ఫైనల్ ఆడలేకపోయారు. ఐసీసీ నియమావళి ప్రకారం, ఫైనల్ ఆడని లేదా టోర్నీలోని కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ప్లేయర్‌లకు (స్క్వాడ్‌లో ఉన్నప్పటికీ) మెడల్ ఇవ్వలేదు.
అయితే నవంబర్ 5న ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా ప్రతీక రావల్ విన్నింగ్ మెడల్ ధరించి కనిపించడం చూసి అందరు ఆశ్చర్యపోయారు. అయితే దీనిపై ప్రతీక తండ్రి క్లారిటీ ఇచ్చారు.
బీసీసీఐ కార్యదర్శి జై షాఅంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధికారులతో మాట్లాడి, ప్రతీక రావల్‌కు విజేత మెడల్ వచ్చేలా కృషి చేసినట్లు ప్రతీక రావల్ తండ్రి గజేంద్ర రావల్ తెలిపారు. గజేంద్ర రావల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, "నేను జై షా సార్‌కు ధన్యవాదాలు చెబుతున్నాను. ఆయన ఐసీసీతో మాట్లాడి నా కూతురుకు మెడల్ వచ్చేలా చేశారు. ఈ విషయంలో ఆయన చాలా చొరవ తీసుకున్నారు" అని చెప్పారు
ఈ టోర్నమెంట్ లీగ్ మ్యాచ్ లు ఆడిన ప్రతీక రావల్ నిలకడగా రాణించింది. 7 మ్యాచ్ లు ఆడిన ఈ టీమిండియా ఓపెనర్ 51.33 యావరేజ్ తో 308 పరుగులు చేసింది.

