గిల్‌తో గంభీర్ సీరియస్ టాకింగ్

Gambhir Has a Serious Talk with Gill: భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టులో ముఖ్యంగా ఇద్దరు ఆటగాళ్ల స్థానం చర్చనీయాంశంగా మారింది. వైస్ కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ గత రెండు టీ20 మ్యాచ్‌లలో పరుగులు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు వచ్చాయి. కీలక మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా గోల్డ్‌ కోస్ట్‌లో ప్రాక్టీస్‌ చేయగా, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ గిల్‌ను పక్కకు పిలిచి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

భవిష్యత్తులో టీ20 కెప్టెన్ అయ్యే రేసులో ముందున్న గిల్.. ఈ సిరీస్‌లో ఇలాగే ఆడితే తుది జట్టులో తన స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది. యశస్వి జైస్వాల్ లాంటి ఓపెనర్ తన అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు.

నితీశ్‌ కుమార్‌ రెడ్డికి ఛాన్స్..?

గాయం కారణంగా తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన ఆల్‌రౌండర్ నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఇప్పుడు కోలుకున్నాడు. లింగ్‌ కోచ్ మోర్నీ మోర్కెల్ నితీశ్‌ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో మెరుగ్గా ఉన్నట్లు ధృవీకరించారు. నితీశ్‌ను జట్టులోకి తీసుకుంటే భారత్‌కు అదనపు బలం అవుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి శివమ్‌ దూబె నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదు కాబట్టి దూబేను తప్పించి నితీశ్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. నితీశ్‌ లోయర్‌ ఆర్డర్‌లో వేగంగా పరుగులు చేయగలడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story