గంభీర్ ప్రశంసలు

Gautam Gambhir Showers Praise: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తాజాగా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (SKY) పై ప్రశంసల వర్షం కురిపించారు. టీ20 ఫార్మాట్‌లో సూర్య నాయకత్వం, మైదానంలో అతని ఆలోచనా తీరు అద్భుతంగా ఉన్నాయని గంభీర్ కొనియాడారు.సూర్యకుమార్ తన వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తాడని, అటువంటి ఆటగాడు కెప్టెన్‌గా ఉండటం జట్టుకు పెద్ద ప్లస్ అని గంభీర్ పేర్కొన్నారు.సూర్య ఆడే విధానం చాలా నిస్వార్థంగా ఉంటుంది. మైదానంలో అతను తీసుకునే నిర్ణయాలు చాలా స్పష్టంగా, వేగంగా ఉంటాయి" అని గంభీర్ ప్రశంసించారు.

గంభీర్, సూర్య ఇద్దరూ గతంలో ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు కలిసి ఆడారు. అప్పటి నుంచే సూర్యలోని ప్రతిభ తనకు తెలుసని, ఇప్పుడు కోచ్-కెప్టెన్లుగా భారత జట్టును ముందుకు నడపడం సంతోషంగా ఉందన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా సూర్య ప్రశాంతంగా ఉంటూ బౌలర్లకు స్వేచ్ఛనిస్తాడని, అది ఒక గొప్ప నాయకుడి లక్షణమని గంభీర్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు ఇప్పటికే సూపర్ ఫామ్‌లో ఉంది. గంభీర్-సూర్య జోడీ భారత్‌కు మరో ఐసీసీ ట్రోఫీని అందిస్తుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story