గిల్ కీలక వ్యాఖ్యలు

Gill Makes Key Remarks: ఇంగ్లండ్‌తో జరిగిన 5 టెస్టుల సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్‌గా ఉన్న శుభ్ మన్ గిల్, ఈ మ్యాచ్‌ల మధ్య విరామం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్, ముఖ్యంగా టెస్టు ఫార్మాట్‌లో ఆటగాళ్లకు వచ్చే పనిభారం (workload) శుభ్ మన్ గిల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ తో జరుగుతోన్న చివరి రెండు టెస్టులకు సమయం మూడు రోజులే ఉండటంపై గిల్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడు.

ఒక సిరీస్‌లో ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఉన్నప్పుడు, ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండటం ఎంత ముఖ్యమో గిల్ చెప్పాడు. దీనికోసం ఆటగాళ్లకు మధ్యలో తగినంత విశ్రాంతి అవసరం అన్నాడు. దీనివల్ల ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి, గాయాల బారిన పడకుండా ఉండటానికి సహాయపడుతుందని చెప్పాడు. అంతేకాకుండా, గిల్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆటగాళ్లందరికీ తగినంత విశ్రాంతి, సమయాన్ని కేటాయించడంపై దృష్టి పెట్టాడు..

అయితే, కొన్ని టెస్టు మ్యాచ్‌ల మధ్య విరామం ఎక్కువ ఉండటం వల్ల కొన్నిసార్లు ఆటగాళ్ల ఫ్లో దెబ్బతినే అవకాశం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు ఏకాగ్రత కోల్పోకుండా, ఫామ్‌ను కొనసాగించడానికి, టెస్ట్ మ్యాచ్‌ల మధ్య బ్యాలెన్స్ చాలా అవసరం అని గిల్ అన్నాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story