Glenn Maxwell: ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్, ఆయన భార్య వినీ రామన్ దంపతుల ఇంట మళ్లీ పండంటి పాప జన్మించింది. తమకు రెండో సంతానంగా లక్ష్మీదేవి లాంటి ఆడపిల్ల పుట్టిందని, ఆ చిన్నారికి 'మాయా మాక్స్‌వెల్' అని పేరు పెట్టినట్లు వారు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. "మా డ్రీమ్ గర్ల్ ఇక్కడికి వచ్చేసింది" అని ఇన్స్టాగ్రామ్‌లో రాసుకొస్తూ తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.

ఈ దంపతులకు ఇప్పటికే లోగన్ మావెరిక్ మాక్స్‌వెల్ అనే కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు పాప రాకతో వీరి కుటుంబం పూర్తయిందని ఫ్యాన్స్, క్రికెట్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2013 డిసెంబర్‌లో తొలిసారి కలిసిన ఈ జంట, 2017 నుంచి అధికారికంగా డేటింగ్‌లో ఉన్నారు. ఫిబ్రవరి 2020లో ఎంగేజ్‌మెంట్ చేసుకోగా, మార్చి 2022లో మెల్‌బోర్న్‌లో వివాహం చేసుకున్నారు. భారతీయ సంతతికి చెందిన వినీ రామన్ సాంప్రదాయం ప్రకారం తమిళ బ్రాహ్మిణ్ పద్ధతిలో, అలాగే క్రిస్టియన్ పద్ధతిలో రెండు రకాలుగా వేడుకగా వీరి వివాహం జరిగింది.

గ్లెన్ మాక్స్‌వెల్ త్వరలోనే మైదానంలో సందడి చేయనున్నారు. ఆగస్టు 26 నుంచి ప్రారంభం కానున్న 'యూరోపియన్ T20 ప్రీమియర్ లీగ్' టోర్నీలో ఆయన 'బెల్ఫాస్ట్ వోల్వ్స్' జట్టుకి కో-ఓనర్‌గా ఉండటమే కాకుండా కెప్టెన్‌గా కూడా వ్యవహరించనున్నారు. స్క్రాచ్ నుంచి కొత్త జట్టును సిద్ధం చేయడం తనకు చాలా మంచి అనుభవమని మాక్స్‌వెల్ తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story