Grand Welcome for Divya: నాగ్ పూర్ లో దివ్యకు గ్రాండ్ వెల్కమ్..
దివ్యకు గ్రాండ్ వెల్కమ్..

Grand Welcome for Divya: ఫిడే మహిళల ప్రపంచ కప్‌లో చారిత్రక విజయం సాధించిని యువ చెస్ సంచలనం దివ్యా దేశ్‌ముఖ్‌కు ఆమె స్వస్థలం నాగ్‌పూర్‌లో ఘన స్వాగతం లభించింది. బుధవారం రాత్రి నాగ్‌పూర్ చేరుకున్న దివ్యా దేశ్‌ముఖ్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ఆమెను చూసేందుకు వందలాది మంది అభిమానులు, కుటుంబ సభ్యులు , స్నేహితులు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అభిమానులు చూపించిన ప్రేమ చూసి చాలా సంతోషంగా, భావోద్వేగానికి లోనయ్యారు దివ్య.
తన విజయం వెనుక తల్లిదండ్రులు, కుటుంబం, తన మొదటి కోచ్ రాహుల్ జోషి (2020లో మరణించారు) కీలక పాత్ర పోషించారని దివ్య చెప్పారు. ఆమె తన విజయాన్ని దివంగత కోచ్‌కి అంకితం చేశారు. ఈ నెల విశ్రాంతి తీసుకుని, వచ్చే నెలలో ఉజ్బెకిస్తాన్‌లో జరిగే గ్రాండ్ స్విస్ టోర్నమెంట్‌లో పాల్గొంటానని దివ్య తెలిపారు. ఫైనల్లో కోనేరు హంపితో ఆడేటప్పుడు తాను ఎలాంటి ఒత్తిడికి లోనవ్వలేదని చెప్పారు. తన దృష్టి అంతా ఆటపైనే ఉందన్నారు.
జార్జియాలోని బటుమిలో జరిగిన ఫిడే మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకోవడంతో దివ్య చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఫైనల్లో ఆమె ప్రముఖ క్రీడాకారిణి కోనేరు హంపిని ఓడించి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకున్నారు.

