Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు మళ్లీ గాయం.. న్యూజిలాండ్ సిరీస్‌పై సందేహాలు
సందేహాలు

Hardik Pandya: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు మరోసారి గాయం కావడంతో భారత జట్టుకు ఇబ్బంది ఎదురైంది. కుడి కాలి షిన్‌లో నొప్పి రావడంతో అతడికి మరికొంత కాలం విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. దీంతో ఆస్ట్రేలియా ‘A’తో జరగనున్న మ్యాచ్‌లకు పాండ్యా దూరమయ్యే అవకాశం ఉంది.
గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని భావిస్తున్న సమయంలోనే పాండ్యాకు మళ్లీ సమస్య తలెత్తింది. తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో గాయం విషయం బయటపడటంతో వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం రికవరీపైనే పాండ్యా దృష్టి పెట్టనున్నాడు.
భారత జట్టు రానున్న కీలక సిరీస్‌లకు సిద్ధమవుతున్న సమయంలో పాండ్యా గాయపడటం చర్చనీయాంశంగా మారింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ జట్టుకు ఉపయోగపడే పాండ్యా సేవలు అందుబాటులో లేకపోవడం జట్టు కూర్పుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
పాండ్యా తిరిగి ఎప్పుడు మైదానంలోకి వస్తాడనే దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు. అతడి గాయం తీవ్రత, కోలుకునే సమయాన్ని బట్టి న్యూజిలాండ్ పర్యటనకు అందుబాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. అప్పటివరకు అతడి ఫిట్‌నెస్‌ను వైద్య బృందం నిశితంగా పరిశీలించనుంది.

