Hardik Pandya’s Instagram Account Deleted: భారత స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాడు. అసలేం జరుగుతోంది హార్దిక్ లైఫ్‌లో? ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిందో లేదో.. అంతలోనే క్రికెట్ ప్రపంచం అస్సలు ఊహించని ఒక సంచలన పరిణామం చోటు చేసుకుంది. లీగ్ స్టేజ్ నుంచే ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో నిష్క్రమించిన కొద్ది రోజులకే.. హార్దిక్ పాండ్యా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను సడన్‌గా డిలీట్ లేదా డీయాక్టివేట్ చేసేశాడు!

మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న తన అకౌంట్‌ను హార్దిక్ ఎందుకు క్లోజ్ చేశాడు? ఐపీఎల్ 2026 వైఫల్యాల తర్వాత నెటిజన్లు చేసిన విమర్శలు భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నాడా? లేక దీని వెనుక ఏదైనా బలమైన వ్యూహం ఉందా? అనే చర్చ ఇప్పుడు నెట్టింట జోరుగా సాగుతోంది. మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో.. సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉండే హార్దిక్, ఇలా అకౌంట్ డిలీట్ చేయడం వెనుక అసలు కథ ఏంటా అని ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు.

అయితే ఈ కథ ఇక్కడితోనే ఆగడం లేదు. హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్లోజ్ చేయడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందే.. ఐపీఎల్ సర్కిల్స్ లో ఒక భారీ రూమర్ షేక్ చేసింది. వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌ను వీడి.. చెన్నై సూపర్‌ కింగ్స్ (CSK) జట్టులోకి మారబోతున్నాడనే ప్రచారం విపరీతంగా సాగుతోంది. ధోనీ వారసుడిగా, రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి యెల్లో ఆర్మీని నడిపించేందుకు హార్దిక్ చెన్నై ఫ్రాంచైజీతో చర్చలు జరుపుతున్నాడనే వార్తలు లీక్ అయ్యాయి.

సరిగ్గా ఇలాంటి క్రేజీ ట్రాన్స్‌ఫర్ రూమర్స్ నడుస్తున్న తరుణంలోనే.. హార్దిక్ తన సోషల్ మీడియా అకౌంట్‌ను క్లోజ్ చేయడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. గతంలో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు మారినప్పుడు కూడా హార్దిక్ ఇలాగే హాట్ టాపిక్‌గా మారాడు. ఇప్పుడు ముంబై కెప్టెన్సీ ప్రెజర్ నుంచి తప్పుకుని.. కూల్‌గా చెన్నై గూటికి చేరేందుకే హార్దిక్ మైండ్ గేమ్ ఆడుతున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story