ఈసారి కీలక మార్పులు

HCA League: హైదరాబాద్ క్రికెట్ అసో సియేషన్ కొత్త సీజన్ కు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి ఎ1 డివిజన్ లీగ్ మ్యాచ్ లు జరుగుతాయని హెచ్సీఏ జాయింట్ సెక్రటరీ బసవరాజు ప్రకటించారు. ఈసారి ఫార్మాట్లో కీలక మార్పులు చేశారు. ఈ సీజన్లో లో 3డే లీగ్ మ్యాచ్లు నిర్వహించడం లేదు. రెండ్రోజుల మ్యాచ్లు మాత్రమే నిర్వహించనున్నారు.

ఇందులో 22 జట్లను మూడు పూల్స్ గా విభజించారు. ప్రతి జట్టు తమ పూల్ లోని మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్లో తలపడుతుంది. గత సీజన్లో ఆధారంగా 22 జట్లు కొత్త సీజన్లో కొనసాగుతాయి. లీగ్ దశ తర్వాత ప్రతి ఫూల్ నుంచి రెండేసి చొప్పున మొత్తం ఆరు జట్లు చాంపియన్ షిప్ ప్లేఅప్స్ కు అర్హత సాధిస్తా యి. ఈ ప్లే అప్స్ 4డే మ్యాచ్ లు గా నిర్వహిస్తారు. ఈ రౌండ్లో ఒక్కో జట్టు ఐదు మ్యాచ్ లు ఆడుతుంది. టాప్- 2లో నిలిచే టీమ్స్ ఫైనల్లో తలపడతాయి. 2025–26 సీజన్‌‌కు సంబంధించిన సబ్‌‌స్క్రిప్షన్ ఫీజులను చెల్లించని క్లబ్స్‌‌, ఇన్‌‌స్టిట్యూషన్స్‌‌ను లీగ్ మ్యాచ్‌‌ల్లో పాల్గొనడానికి అనుమతించరు

PolitEnt Media

PolitEnt Media

Next Story