Australian legendary captain Ricky Ponting: టీ20 వరల్డ్ కప్‌లో అతడే టాప్ స్కోరర్: రిక్కీ పాంటింగ్ జోస్యం!
రిక్కీ పాంటింగ్ జోస్యం!

Australian legendary captain Ricky Ponting: టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ శర్మ ఒక అసాధారణమైన ప్రతిభావంతుడని (Superstar), ఈ మెగా టోర్నీలో అతడే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడని పాంటింగ్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ టోర్నీలో అతను 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అయ్యే అవకాశం కూడా ఉందని 'ఐసీసీ రివ్యూ'లో పేర్కొన్నారు.
అభిషేక్ శర్మకు అంతర్జాతీయ స్థాయిలో అనుభవం తక్కువగా ఉండటం భారత్‌కు ప్రతికూలత కాదని, అది జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని పాంటింగ్ విశ్లేషించారు. "అభిషేక్ అద్భుతంగా ఆడితే భారత్‌ను ఓడించడం ఎవరి తరము కాదు. ఒకవేళ అతను విఫలమైతే భారత్ కూడా మిగతా జట్లలాగే ఒత్తిడికి లోనవుతుంది. ఈ వరల్డ్ కప్‌లో భారత విజయావకాశాలు అతనిపైనే ఆధారపడి ఉన్నాయి" అని పాంటింగ్ అభిప్రాయపడ్డారు.
17 ఏళ్ల వయసులోనే గుర్తించా: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా పనిచేసిన సమయంలో అభిషేక్‌ను తాను దగ్గర నుండి చూశానని పాంటింగ్ గుర్తు చేసుకున్నారు. "అతను 17 ఏళ్ల వయసులో నా శిక్షణలోనే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. మొదటి బంతినే క్లాసికల్ షాట్‌తో బౌలర్ తల మీదుగా కొట్టినప్పుడే అతనిలో ఏదో ప్రత్యేకత ఉందని నాకు అర్థమైంది. అతన్ని వదులుకోవద్దని అప్పట్లో ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్‌ను నేను ఎంతగానో బతిమిలాడాను. కానీ కుదరలేదు. ఇప్పుడు నేను ఊహించినట్టే అతను ఒక స్టార్‌గా ఎదిగాడు" అని పాంటింగ్ కొనియాడారు. ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న అభిషేక్ శర్మపై పాంటింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

