Asia Cup 2025: ఆసియా కప్ లో హై ఓల్టేజ్ మ్యాచ్ రేపే..
హై ఓల్టేజ్ మ్యాచ్ రేపే..

Asia Cup 2025: ఆసియా కప్ లో రేపు భారత్, పాకిస్తాన్ మధ్య జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రేపు రాత్రి 8:00 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఇండియా క్లియర్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ టోర్నీకే ప్రధాన ఆకర్షణగా మారనుంది. భారత్ ఇప్పటికే యూఏఈపై, పాకిస్తాన్ ఒమన్‌పై తమ మొదటి మ్యాచ్‌లలో విజయం సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరుదేశాల అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
ఇండియా స్క్వాడ్:
అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, సంజు శాంసన్, రింకు సింగ్, అర్ష్‌దీప్, అర్ష్‌దీప్, అర్ష్‌దీప్.
పాకిస్థాన్ స్క్వాడ్
సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్.
